అప్పు చెల్లించలేదని కార్మికుడిని మూడు రోజులు పాటు నిర్భంధం
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో అమానుషం జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదని చేనేత కార్మికుడిని యజమాని మూడు రోజుల పాటు నిర్బంధించాడు. ఈ సంఘటన ఎర్రజోడు చేనేత ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


