అమెరికాలో తెలుగు సంక్రాంతి సంబరాలు

లెక్జింగ్టన్‌ : తెలుగు సంక్రాంతి సంబరాలను అమెరికాలోని లెక్జింగ్టన్‌లో జనవరి 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ‘లెక్జింగ్టన్‌ తెలుగు కమ్యూనిటీ’ నిర్వహకులు తెలిపారు. స్థానిక బీటీసీసీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొనాలని కోరారు. 18న రంగవల్లుల పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని..స్థానికులు భారీగా పాల్గొని సంబంరాలను విజయవంతం చేయాలని కోరారు.