అయిదోరోజుకు చేరిన వైఎస్‌ఆర్‌ సీపీ దీక్ష

హైదరాబాద్‌ : కరెంట్‌ కోతలు-విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆరోగ్యం క్షీణిస్తోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో పాటు పలువురు నేతలకు వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారని, శోభానాగిరెడ్డి, సుజయ్‌ కృష్ణరంగారావులకు షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని వైద్యులు తెలిపారు.
మరోవైపు…రాత్రి 11 గంటల సమయంలో దీక్షా ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతంగా జరుగుతున్న దీక్షా శిబిరంలోకి పోలీసులుల రావడంతో అక్కడ కొంచెం హడావిడి నెలకొంది. దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా రాత్రంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానులు దీక్షా శిబిరం వద్దనే ఉన్నారు.