అయిదోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు
హైదరాబాద్: ఓఎంసీ అక్రమాల కేసు నిందితుడు బీవీ శ్రీనివాస్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. అయిదోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇవాళ న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్టై ఏడాదయిందని, ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినందున బెయిల్ ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు శ్రీనివాస్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే కేసులో నిందితుడు రాజగోపాల్ అయిదు రోజుల తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. అనంతపురంలో అనారోగ్యంతో ఉన్న తన మామను చూసేందుకు వీలుగా తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. రాజగోపాల్ పిటిషన్‌పై కోర్టు గురువారం నిర్ణయం వెల్లడించనుంది.



