అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: విద్యుత్‌సౌధలో ట్రాస్స్‌కోసీఎండీ ఛాంబర్‌లో శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇవాళ వారు విద్యుత్‌సౌధ ముందు చేపట్టిన కరెంట్‌ దీక్షలో అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎండీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. ఛాంబర్‌ అద్దాలు పగులగొట్టి వారిని బయటకు తీసుకురావడానికి పోలీసులు ఛాంబర్‌ అద్దాలు పగుల గొట్టడంతో ఆత్మహత్య చేసుకుంటామని వారు డిమాండ్‌ చేశారు. రైతులకు కరెంట్‌ సరఫరా చేయాలని ప్రజాస్వామ్య బద్దంగా కోరడం తప్పాఅని వారు పోలీసులను నిలదీశారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దీక్షకు విద్యుత్‌ ఆధికారులు స్పందించారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సీఎండీ సమావేశమయ్యారని సమాచారం.