అర్టీసీ బస్సు ఢీకోని యువకుడి మృతి

కేవీహెచ్‌బీ కాలనీ : సైకిల్‌పై రోడ్డు దాటుతున్న ఓ యువకుడుని కేవీహెచ్‌బీ కాలనీ బస్సు డిపో ఎదుట అర్టీసీ బస్సు ఢీకోంది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కుమార్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌కుమార్‌ బతుకు తెరువు కోసం వచ్చి మూసాపేటలో నివాసం ఉంటున్నాడు. ప్రశాంత్‌ నగర్‌లో ఓ ఫ్యానుల కంపెనీలో పనిచేస్తున్నాడు.అదివారం ఉదయం సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ఫలక్‌ నామా అర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకోంది. తీవ్ర గాయాలైన ఉమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని గాంధీ అసుపత్రికి తరలించారు.