అవన్నీ కాంగ్రెస్‌ పథకాలే : బొత్స

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సదస్సులో ప్రభుత్వ పథకాలు నావి అని సీఎం చెప్పినప్పటికీ అవన్నీ కాంగ్రెస్‌ పథకాలేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  భాషా ప్రయోగంలో సీఎం అలా మాట్లాడారని.. ఈ వ్యవహారంలో వివాదం చేయవద్దని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో అందరూ సమష్టిగా పనిచేస్తారని.. ఒక వ్యక్తితో ఏ కార్యక్రమాలు జరగవని చెప్పారు. మంగళవారం నుంచి నాలుగైదు జిల్లాలను ఒకే చోట చేర్చి 15 రోజులకు ఒక పార్టీ  సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.