అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు: సిపి
హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): ఈ నెల 27 నుంచి జరుగనున్న తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల చుట్టూ నాలుగు కిలోవిూటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు 27 ఉదయం 6 గంటల నుంచి వచ్చె నెల 2 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని కమిషనర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని పేర్కొన్నారు. శాంతి భద్రతల
పరిరక్షణ నేపథ్యంలో నింబధనలు విధిస్తున్నట్టు వివరించారు. శాసన సభ సమావేశాల నేపథ్యంలో 3 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. అనుమతి ఉన్న వారికి మాత్రమే అసెంబ్లీలోకి అ నుమిస్తామన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.



