అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంపై సభలో ఆగ్రహం

హైదరాబాద్‌: అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంపై నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే బల్లిదుర్గాప్రసాద్‌ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల జాబితా సేకరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌ పేరును కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జాబితాలో చేర్చారు. దీనిపై దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జాబితా సరిగా సేకరించలేని ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు.