అసోంలో నేడు రాహుల్ పర్యటన
న్యూఢిల్లీ: అసోంలో అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యిదర్శి రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఘర్షణలు చెలరేగిన డుబ్రీ, కోక్రాఝర్ జిల్లాలో రాహుల్ పర్యటించి పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించనున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, హోంమంత్రి షిండే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే అసోంలో పర్యటించారు.



