అస్సాంలో ముంచెత్తిన వరదల కారణంగా 12 కు చేరిన మృతులు

గౌహతి: అస్సాంను ముంచెత్తిన వరద ఈ రాష్ట్రంలో భీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 16 రాష్ట్రాల్లోని సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.