ఆక్రమణల కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం : జేసీబీ ధ్వంసం
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కొండాపూర్ సమీపంలోని అంజయ్యనగర్‌లో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధనుంజయరెడ్డి ప్రోద్బలంతోనే జీహెచ్‌ఎంసీ అధికారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీబీని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. స్థానికులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.



