ఆక్వాసాగుకు మళ్లుతున్న పచ్చనిపొలాలు

ఏలూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి):జిల్లాలో గత అయిదేళ్లలో సుమారు లక్ష ఎకరాల వరి పొలాలు రొయ్యలు,
చేపల చెరువులుగా మారిపోయాయి. ఆక్వాసాగు లాభాలు పండిస్తాయని పలుపువు అటువైపు మొగ్గు
చూపుతున్నారు. కాలుష్యం భయం వెన్నాడుతున్నా లాభాలే ముఖ్యమన్న రీతిలో సాగుతున్నారు.
లక్ష ఎకరాల్లో సంవత్సరానికి సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి తగ్గిపోయింది. ఈ ప్రకారం వరి ద్వారా వచ్చే రూ.800 కోట్ల ఆదాయం కోల్పోతున్నారు. ఒక ఎకరం పొలంలో సుమారు రెండు పంటల్లో
కలిపి 150 మంది వరకూ పనిచేస్తారు. ఇలా 1.50 కోట్ల మంది వరి కూలీలు పని కోల్పోతున్నారు. అదే విధంగా కనీసం 20 వేల మంది కౌలు రైతులు తీవ్రంగా ప్రభావమవుతున్నారు. ఇది కాకుండా వ్యవసాయంపై ఆధారపడే రైతులకు సంబంధించిన మిల్లులు కూడా మూతపడే స్థాయికి చేరుకున్నాయి. పోనీ ఇవన్నీ, వ్యవసాయానికి పనికిరాని భూములా అంటే అదేం లేదు. కొందరి దురాశ కోట్లాది మందికి ఉపాధిని, వేలాది మందికి అన్నాన్ని లేకుండా చేస్తున్నాయి.సాధారణంగా వరి పొలాన్ని ఆక్వా సాగు గాని, ఇతర ప్రత్యామ్నాయాలకు వినియోగించాలంటే కచ్చితంగా అది వ్యవసాయానికి పనికిరాకుండా ఉండేదై ఉండాలి. ఇదేదో ఒకటి, రెండు సీజన్లతో సరిపెట్టే విధానం కాదు. వరుసగా మూడు నుంచి నాలుగేళ్లపాటు సాగుకు అనుకూలంగా లేకుండా ఉండాలి. కానీ, జిల్లాలో వరి సాగవుతున్న ఏ పొలం కూడా వరుసగా మూడేళ్లపాటు పంటలు పండకుండా ఉన్న సందర్భం లేదు. కానీ, ఇక్కడ వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పర్యావరణ శాఖలు, కొల్లేరు అయితే అటవీశాఖ ఇలా ఎవరికి వారు నిరభ్యంతర పత్రాలు అందజేస్తున్నారు.
దీంతో మండలస్థాయిలో మొదలైన ఈ అవినీతి మూలం జిల్లా స్థాయిలో అనుమతులు తీసుకొచ్చే స్థాయి దీంతోరకూ వేళ్లూనుకుపోయింది. దీనిని ప్రశ్నించేవారిని ఆక్వా మాఫియా భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వంద ఎకరాలు తవ్వాలనుకున్న వ్యక్తికి మధ్యలో ఒక బక్క రైతుకు చెందిన పొలం రెండుమూడు ఎకరాలు ఉన్నా కచ్చితంగా వీరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా వీరిపై బ్రహ్మాస్త్రం విసిరి లోబరుచుకుంటున్నారు. దీంతో  పచ్చని మాగాణాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నారు. లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయాల్సిన వరి పొలాలన్నీ కూడా చేపల చెరువులుగా మారిపోయాయి.  ఆక్వా సాగుకు కొన్ని పొలాలు మళ్లినా ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదనేది వింతవాదన తీసుకొస్తున్నారు. పంట పొలాల్లోకి ఆక్వా నీటిని నేరుగా వదిలి ఆ పంటలు పాడవడానికి కారణమవు తున్నారు.ఈ విషయం మండలస్థాయి అధికారులకు స్పష్టంగా తెలిసినా పట్టించుకునేవారే కరవయ్యారు. ఇలా ఎకరాలకు ఎకరాలు మాయమవుతున్నాయి.  పంట పొలాల్లోకి ఆక్వానీరు వదలిన వారికి తాఖీదులు ఇచ్చారు. వివిధ సిఫార్సులు అనంతరమే తాము చెరువులకు అనుమతులు ఇస్తామని సాగుకు యోగ్యమో కాదో తేల్చాల్సింది వ్యవసాయశాఖ అని మత్స్యశౄఖ అధిరకారులు పేర్కొన్నారు. దిగుబడులు తక్కువగా వస్తున్న వ్యవసాయ భూముల్లోనే చేపల, రొయ్యల చెరువులుగా మార్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.  పురపాలక సంఘ ప్రతినిధులకు ఈ విషయాలు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.