ఆదరణ కోల్పోతున్న గొందళి కళ. ఎక్నాథ్ దున్గే.
కూకట్ పల్లి, (జనంసాక్షి):
నెత్తిన తలపాగా మెడలో పూసల దండలు, పంచేకట్టు, లాల్చి, దానిమీద చిన్న చేతులు లేని కోటు చేతిలో సంబాల, చట్ గీ, తాళాలాంటి వాద్యాలు.. ఇది గొందళిలా కల గాయకుడి స్వరూపం ఇద్దరు కలిసి ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దేశభక్తిని ఆత్మగౌరవాన్ని పెంచే జానపద గీతాలు ఒకరు పాడుతుంటే మరొకరు సంగీత వాద్యాల్ని ఇంపుగా మోగిస్తుంటారు. పాట పూర్తయిన తర్వాత గాయకుడు ఆ పాట అర్ధాన్ని వివరిస్తూ ఉంటాడు, గొందళి కళాకారులు కథ చెబుతూ నాట్యం కూడా చేస్తారు. గొందళిలు అసలు మహారాష్ట్ర నుంచి వచ్చారని చెబుతారు పరశురాముడు తల్లిదండ్రులైన జమదగ్ని, రేణుకలు, తమ వంశంకర్తలని వీళ్లు నమ్ముతారు.17 శతాబ్దంలో ఈ గొందళికలళకు లభించిన ఆదరణ అంత ఇంత కాదు ఇదే వృత్తిగా జీవించే వాళ్ళు ఆ కాలంలో ఎందరో ఉన్నరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ గాయకులకు నీరాజనులు పట్టేవారు చరిత్రక గీతాలు జానపద గీతాలతో పాటు అంబ భవానిని స్తుతిస్తూ పాడే గీతాలు ఈ వరకు ఆచారంగా ఉండేది తెల్లవారు నడిచేయి ఈ గాన కాలక్షేపం ఇంతవరకు ఆకట్టుకునేది అంబ,భవాని, గొందళి గాయకుల్ని ఆవేశించి భూత భవిష్యత్తు వర్తమానం పూసగుచ్చినట్టు వివరిస్తుందని మహిమలు చేస్తుందని నమ్మేవారు. ఈ గొందళి కార్యక్రమాన్ని వినేందుకు వీక్షించేందుకు దేవతల్ని,దేవుళ్ళని ఆహ్వానించి ఆవాసన చేసే ఆచారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ కళ కు ఆదరణ తగ్గిపోవడం వల్ల చాలామంది గొందళిలు వ్యవసాయదారులుగా, కూలీలుగా మారిపోయారు. దుర్గా నవరాత్రులు లాంటి సందర్భాల్లోనూ రేడియో టీవీల్లోనూ మాత్రమే తమకలను ప్రదర్శిస్తున్నారు. గొందళిలు మత సామరస్యానికి పెట్టింది పేరు వీళ్ళు అన్ని హిందూ పర్వదినాలతో పాటు మొహరం లాంటి పండుగల్ని కూడా జరుపుకుంటారు. ప్రస్తుతం వెనుకబడిన తరగతులకు చెందిన వారిగా గుర్తింపు ఉన్న గొందళిలు ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించి తమ కళ కు ఆదరణ కలిగించి కళాకారులను పెన్షన్ రూపంలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏక్నాథ్ దున్గే.