ఆదాయపన్ను అధికారి ఇంట్లో కొనసాగుతున్న సీబీఐ తనిఖీలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదాయపన్ను అధికారి పి.కెంకటేశ్వరరావు ఇంట్లో ఈరోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక సంస్థకు చెందిన ఆదాయపన్ను లావాదేవీలలో దాదాపు రూ.50 కోట్ల మేరకు పన్ను తగ్గించేందుకు ఈ సంస్థ నుంచి రూ.65లక్షలు లంచంగా ఈనుకున్నట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం వెంకటేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపి రూ.65లక్షల నగదును స్వాధానం చేసుకున్నారు.