ఆదివాసి చట్టాల అమలులో అధికారుల అలసత్వం
– 1/70,పెసా చట్టాలు అమలులో అధికారుల నిర్లక్ష్యం.
– భావితరాల ఆదివాసుల మనగడ ప్రశ్నార్థకరం..?
– 20 వ రోజుకు చేరుకున్న దీక్షలు.
– గవర్నర్ ను కలిసి అధికారుల పైన ఫిర్యాదు చేస్తాం. ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం.నాగరాజు.
వెంకటాపురం(నూగూరు),సెప్టెంబర్
ఆదివాసుల హక్కులు చట్టాలు అమలులో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని వాసం నాగరాజు విమర్శించారు.76 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు.ఈ ప్రభుత్వాల పై ఆదివాసీ జాతి మొత్తం దండయాత్రకు సిద్ధం అవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసారు.ఏజెన్సీలో వలస గిరిజనేతరులను వెల్లగొట్టడమే ప్రధాన ఎజెండా అంటూ ఉద్యమిస్తామన్నారు.నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదం తో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఆదివాసుల త్యాగాలు గుర్తులేవా అని ప్రభుత్వాన్ని విమర్శించారు.తెలంగాణ నుండి ఆంధ్ర వాళ్ళను ఎల్లగొట్టి,ప్రత్యేక ప్రాంతం అయిన 5వ షెడ్యూల్డ్ నుండి వలస గిరిజనేతరులను ఎందుకు పంపించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏ.ఎన్.ఎస్.చేస్తున్న దీక్షలు ఆదివారం నాటికి 20 వ రోజుకి చేరుకున్నాయి. బర్లగూడెం సర్పంచి కొర్శా నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు చట్టాలు అమలు చేయాలని దీక్షలు చేస్తూ ఉంటే అధికారులు మాత్రం చలనం లేకుండా చోద్యం చూస్తున్నారని ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది వాసం.నాగరాజు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆదివాసీల చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కలువనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 17 న అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలియజేశారు. ఏజెన్సీ చట్టాల అమలు తీరు పైన ,అధికారుల నిర్లక్ష్యం కారణంగా 1/70 ,పెసా ,అటవీ హక్కుల చట్టాలు అమలు కావడం లేదని అధికారుల పైన గవర్నర్ కి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్, మండల పరిషత్ ,రెవెన్యూ అధికారుల పని తీరు పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా గవర్నర్ ని కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. అధికారుల అవినీతి పై సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. అవసరం అనుకుంటే అధికారుల పైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
మద్దతు తెలిపిన క్రైస్తవ సోదరీమణులు.
గత 20 రోజుల నుండి చేస్తున్న దీక్షలకు ఆదివాసీ క్రైస్తవ సోదరీమణులు మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఈ ఉద్యమానికి వెన్నంటి ఉంటామని అన్నారు. చెలే రాజేష్, అట్టాం సుభద్ర సుజాత,వెంకటమ్మ, రాజమహేశ్వరి,పూజ, అంకిత,రమ, స్రవంతి,తిరుపతమ్మ, సారమ్మ, హిందు, రాజేశ్వరి,నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|