ఆధార్ అనుసంధానంతో నగదు బదిలీకి సీఎం శ్రీకారం
చిత్తూరు: ఆధార్ అనుసంధానంతో తపాల ద్వారా సామాజిక భద్రత ఫించన్లు , ఉపాధిహామి పథక చెల్లింపుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించారు. అనంతరం మార్కెట్ మార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడారు. కేంద్ర మంత్రులు జైరాంరమేష్ , కిల్లికృపారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


