‘ఆధార్‌’ ఉంటేనే అనుసంధానిస్తాం!

జనంసాక్షి, హైదరాబాద్‌ : వంటగ్యాస్‌ సబ్సిడీకి సంబంధించి ‘ఆధార్‌’ అనుసంధాన ప్రక్రియ విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌ కార్డులు ఇంకా అందరికీ రాని నేపథ్యంలో ఆధార్‌ నమోదు సంఖ్యను వంటగ్యాస్‌ నంబర్‌కు అనుసంధానం చేయాలని సర్కారు ఆదేశించినా, డీలర్లు మాత్రం అందుకు వీలుకాదని పేర్కొంటున్నారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ ఇస్తేనే అనుసంధానం చేస్తామని, ఆధార్‌ నమోదు సంఖ్య ఆధారంగా అనుసంధానం చేయబోమని స్పష్టంచేస్తున్నారు.