ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ ఎండీ రమేష్‌ రెడ్డిని టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగర వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల రూపాయల మేరకు మోసగించినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో దార్యాప్తు చేసిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయల విలువైన కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నెలకొల్పిన 5 ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సెంటర్ల ద్వారా రమేష్‌రెడ్డి మోసాలకు పాల్పడొ నట్లుగా విచారణలో వెల్లడైంది.