ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ తోనే సాధ్యం – బోస్లే నారాయణరావ్ పటేల్

భైంసా రూరల్ నవంబర్ 27జనం సాక్షి

నిర్మల్ జిల్లా : తన పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ముథోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నియోజకవర్గంలో పకడ్బందీగా అమలు చేస్తానని బాండ్ పేపర్ పై సంతకం చేసిన నారాయణ రావు పటేల్ బాండ్ పేపర్ అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు
వీరికి ఆలయ అర్చకులు అమ్మవారి హారతులతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం మండల కేంద్రంలోని పలు ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గం లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని దాని తర్వాత ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదోల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.