ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

చెన్నై: పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు పతనమైన అనంతరం ధోనితో కలిసి నిలకడగా అడుతున్న రైనా (43) హఫీజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ధోని 24 పరుగులతో అడుతున్నాడు. 35 ఓవర్టు ముగిసేసరికి భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.