ఆర్టీసీలో మరో కార్మిక సంఘం

హైదరాబాద్‌: ఏపీఎస్‌ఆర్‌టీసీలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఎస్‌ఎంయూ, బీఎంఎస్‌లతో పాటు  ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు దళిత కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ పేరుతో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని అధ్యక్షుడు సుభాష్‌ తెలిపారు. ఈ సంఘం ద్వారా బహుజన, దళితుల సమస్యల పరిష్కారానికి పోరాటం  చేస్తూ కార్పొరేషన్‌ కాపాడు కుంటామని ఆయన చెప్పారు.