ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హయత్‌నగర్ -1 ఆర్టీసీ డిపో కార్మికులు నిరాహార దీక్షలకు దిగారు. డిపో మేనేజర్ కార్మికులను వేధిస్తున్నారని సంఘం నేతలు ఆరోపించారు. డిపో మేనేజర్ వైఖరిపై అనేక సార్లు పై అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో దీక్షలకు దిగామన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు.



