ఆర్టీసీ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం
హైదరాబాద్: ఇప్పటికే పెరిగిన ధరలతో సతమవుతున్న సామాన్యులకు మరో భారం నెత్తిన పడింది. ఆర్టీసీ కి అదనపు భారం మీద పడింది.దీంతో నష్టాల్లో కోనసాగుతున్న ఆర్టీసీకి వేరే ప్రత్యామ్నాయం లేక ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు ఈ ఆర్థరాత్రి నుంచి అమలు కానున్నాయి. పల్లెవెలుగు బస్సులో 25 కి.మీ వరకు ఒక రూపాయి, 45 కి. మీ. వరకు రూ. ఆపై ప్రతి కి. మీ. 5 పైసల చొప్పున పెంచింది. డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులో కి. మీ.కు కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కి. మీ.కు 12 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంద్ర, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని ప్రకటించింది. రద్దీని బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని తెలియజేశారు.



