ఆర్టీసీ, రావాణాశాఖాధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం
హైదరాబాద్: అక్రమ రవాణా చేస్తూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్, ఇతర వాహనాలపై ముమ్మర దాడులు చేయాలని రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ, రవాణాశాఖాధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలను 2013 ఏప్రిల్ నాటికి కంప్యూటరీకరిస్తామని, హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లపై ఆదేశాలు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.



