ఆర్‌ఎన్‌ఎన్‌ మాజీ చీఫ్‌ సుదర్శిన్‌ కన్నుమూత

రాయ్‌పూర్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కె. ఎస్‌. సుదర్శన్‌ (81) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1954 నుంచి రాష్ట్రయ స్వయం సేవక్‌ సంఘ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో కీలక  పాత్ర పోషించారు. 2000-2009 మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్‌గీఏ ప్రభుత్వం హయాంలో వాజ్‌పేయ్‌, అద్వానీలకు పలు కీలక సూచనలు చేశారు.2009 మార్చి 21న అధ్యక్ష పదివి నుంచి వైదొలిగారు