ఆశ వర్కర్లు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన.
జనం సాక్షి దుబ్బాక.
ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18000 రూ”లు అమలు చేయాలి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశా వర్కర్ల సమ్మె 4వ రోజు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆషా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఆశ వర్కర్లు గత 32 సంవత్సరాల కాలంగా 28 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారని వీరంతా మహిళలు బడుగు,బలహీన వర్గాలకు చెందిన వారని తెలిపారు.బీపీ,షుగర్, థైరాయిడ్ ,తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తూ, గర్భిణీ,బాలింతలు,చిన్న పిల్లలకు, ఇతర ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.కరోనా మహమ్మారి కాలంలో సైతం కరోనా నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు అనేక రకాల పనులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్లకు నేటికీ గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆశ వర్కర్లకు అనేక రకాల పని బారాలు పెరిగాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్లకు పిక్స్ డ్ వేతనం 18000 ఇవ్వాలని పిఎఫ్,ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించి హెల్త్ కార్డులు ఇవ్వాలని,ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. పారితోషకాలు లేని అదనపు పనులను ఆశలతో చేయించకూడదని, 32 రకాల రిజిస్టర్స్ ను ప్రభుత్వమే ప్రింట్ చేసి అందించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శ్యామల, శోభా, అనిత, లత, దేవలక్ష్మి, శారద, సంతోష, బాబాయ్, చంద్రకళ,తదితరులు పాల్గొన్నారు