ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ

హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విభాగంలో ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ, తెలిపింది. ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 8,234 సీట్లను కేటాయించారు.