ఇంటెల్‌ కొత్త ప్రాసెసర్‌ ‘ఇటానియమ్‌ 9500’

బెంగళూరు : ప్రముఖ కంప్యూటర్‌ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ కొత్త ప్రాసెసర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ ఇటానియమ్‌ 9500’ పేరుతో విపణిలోకి విడుదల చేసిన ఈ ప్రాసెసర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ప్రాసెసర్‌ గత వాటి కంటె రెండు రెట్లు ఎక్కువ సామర్థంతో పనిచేస్తాయని సంస్థ తెలిపింది. పెరిగిన పనిభారం తగ్గించడం, డేటాబేస్‌, అధిక మొత్తంలో అప్లికేషన్స్‌ అభివృద్థి చేయడం వంటి వాటిని ఈ ప్రాసెసర్‌ మరింత సులువు చేయగలుతుందని సంస్థ వివరించింది.