ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్‌ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలు ఒంటరి కాదని ఆమె వెంట తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు.