ఇందిరాపార్కు వద్ద భాజపా సత్యాగ్రహం

హైదరాబాద్‌: భాజపా, ఆర్‌ఎన్‌ఎన్‌లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా ఇందిరాపార్కు వద్ద ఈరోజు సత్యాగ్రహం చేపట్టింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్‌ తదితరులు పాల్గోన్నారు.