ఇక మన నావిగేషన్‌

C

– భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం

– దిక్సూచి శాటిలైట్‌ ప్రయోగం విజయవంతం

– అభినందించిన ప్రధాని మోదీ

శ్రీహరికోట,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):అంతరిక్షంలో భారత్‌ సగర్వంగా తలెత్తుఎకునేలా మరో విజయాన్ని మన శాస్త్రవేత్తలు సాధించారు. భారత్‌ ఇతర దేశాల సరసనచేరగలిగే విజయాన్ని సాధించి పెట్టారు. యావత్‌ ప్రపంచం కూడా మనవైపు చూసేలా ఇస్రో శాస్త్రవేత్తలు నావిగేషన్‌ పరిశోధక రంగంలో ఘన విజయాన్ని అందించి శభాష్‌ అనిపించుకున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి33 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.రాకెట్‌ తనకు నిర్దేశించిన సమయంలో ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ 1జీ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేళపెట్టింది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్టయింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సహాలు వెల్లి విరిశాయి. అనంతంర ప్రధాని మోదీ మాట్లాడుతూ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ఉప్రగహ ప్రయోగం విజయవంతంతో 1500 చ.కి.విూ పరిధిలో నావిగేషన్‌ వ్యవస్థ సేవలుఅందుబాటులోక్యిస్తాయన్నారు.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.  12 ఏళ్లపాటు ఇది మనకు సేవలు అందించనుంది. దేశం సరిహద్దుల నుంచి 15 వందల కిలోవిూటర్ల పరిధిలో సేవలు అందనున్నాయి. భూతల, ఆకాశ, సముద్ర మార్గాల దిశల్లో సేవలు అందించనుంది. విమానాలు, ఓడల గమన దిశానిర్దేశంలో కీలక పాత్ర పోషించనుంది. భద్రతా బలగాలకు నావిగేషన్‌ సిస్టం రూపొందించేందుకు సహాయం చేయనుంది. భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. నావిగేషన్‌ వ్యవస్థలో ఏడో ఉపగ్రహ ప్రయోగం పూర్తి కావడంతో దేశంలో సమూల మార్పులు వస్తాయన్నారు. ఈ ఉప్రగహ ప్రయోగంతో దేశానికి సొంత జీపీఎస్‌ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. సామాన్యుల జీవితాలు, వ్యవస్థల్లో మార్పుల కోసం అంతరిక్ష పరిజ్ఞానం దోహదపడుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.  ఇస్రో మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. వివరాలు.. ఆంధప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి  దీని ద్వారా ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. సొంతంగా నావినేషన్‌ వ్యవస్థ కలిగిన ఐదు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలవడం గర్వకారణంగా ఉందని మోదీ అన్నారు. ఇస్రో సేవలు మన దేశానికే కాకుండా, సార్క్‌ దేశాలకు కూడా అందించాలని మోదీ సూచించారు. ఇస్రో విజయాలు ఇలాగే కొనసాగితే అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్‌ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశీయ జీపీఎస్‌ వ్యవస్థను సుస్థిరం చేసుకునే దిశగా తుది రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో సాంప్రదాయ నావిగేషన్‌ వ్యవస్థకు ఇక స్వస్తి పలికే ఛాన్సుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పంపే జీపీఎస్‌ సందేశాలు మరింత ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. నయా నజరానాగా కీర్తించారు. విశ్వంలో మన దేశ పేరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందన్నారు. తొలి స్టేజ్‌లో రాకెట్‌ 110 సెకన్లు ప్రయాణం చేసింది. చాలా నార్మల్‌గా రాకెట్‌ దూసుకెళ్లింది. స్వచ్ఛమైన ఆకాశంలో రాకెట్‌ కక్ష్య దిశగా శరవేగంగా దూసుకెళ్లింది. అన్ని దశల్లోనూ సాధారణంగా రాకెట్‌ ప్రయాణించడం ఇస్రో శాస్త్రవేత్తలను తన్మయత్వంలో ముంచింది. రెండవ లిపిడ్‌ స్టేజ్‌లోనూ రాకెట్‌ నార్మల్‌గా ప్రయాణించింది. మూడవ సాలిడ్‌ స్టేజ్‌లోనూ రాకెట్‌ అనుకున్నట్టుగానే దూసుకెళ్లింది. బెంగళూర్‌, అహ్మాదాబాద్‌ ఇస్రో కేంద్రాల నుంచి రాకెట్‌ ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు

ప్రత్యక్షంగా వీక్షించారు. సొంత నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఇప్పటికే ఆరు ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి రెండు రకాల సేవలు పొందవచ్చు. స్టాండర్డ్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ ద్వారా అందరికీ సేవలు అందుతాయి. అలాగే నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. విమానాలు, నౌకలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ దిశానిర్దేశం చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తుంది. దీని ద్వారా ఏ వాహనమైనా ఎక్కడుందో… ఇట్లే పసిగట్టగలం. మొబైల్‌ ఫోన్లలో ఇంటిగ్రేషన్‌ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మ్యాపింగ్‌, డేటా సేకరణ, ట్రెక్కింగ్‌, ట్రావెలర్లకు ఇది మరింత ఉపయోగం. 20 విూటర్ల ప్రదేశంలో ఎలాంటి వస్తువునైనా ఈ శాటిలైట్లు ఇట్టే పసిగట్టగలవు. 1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో పాక్‌ బలగాలు, తీవ్రవాదుల కదలికలపై జీపీఎస్‌ సమాచారం ఇవ్వాలని భారత్‌… అమెరికాను కోరింది. అందుకు అమెరికా నిరాకరించింది. దీంతో సొంత నావిగేషన్‌ కోసం భారత్‌ అప్పుడే నడుం కట్టింది. ఈ పీఎస్‌ఎల్వీ సీ 33 విజయవంతంతో 17 ఏళ్ల కృషి నేడు సాకారం అయింది.. 1,425 కేజీల ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ నింగిలోకి తీసుకు వెళ్లింది. అతి తక్కువ ఖర్చుతో మెగా ప్రాజెక్టును ఇస్తో రూపొందించింది. అయితే ఇదే నావిగేషన్‌ కోసం చైనా 35 శాటిలైట్లను ప్రయోగించింది. అలాగే బైదూ నావిగేషన్‌ కోసం చైనా భారీగా ఖర్చు చేసింది.