ఇరాక్ ఉపాధ్యక్షుడు తారిఖ్‌కు ఉరి శిక్ష
బాగ్దాద్: రెండు హత్యలతోపాటు దేశంలో మతతత్వ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యారని ఇరాక్ ఉపాధ్యక్షుడు తారిఖ్ అల్ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక క్రిమినల్ కోర్టు ఆదివారం తార్పు చెప్పింది. హత్యకేసులో నిందితుడిగా గుర్తించడంతో ఈ ఏడాది తొలినాళ్లలో హషేమి విదేశాలకు పారిపోయారు. ఈ కేసు సున్నీ, షియా, కుర్దష్ వర్గాల్లో రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపింది. విచారణ అనంతరం రెండు హత్య కేసుల్లో హషేమి, ఆయన అల్టుడు దోఘులుగా కోర్టు స్పష్టం చేసింది. ఇరాక్ చట్టాల ప్రకారం దోష నిర్ధారణ జరిగితే తక్షణమే వారిని శిక్షించాలి. అయితే ఈ కేసులో పై కోర్టు అప్పీలుకు స్థానిక కోర్టు అనుమతిచ్చింది.



