ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు

శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు

శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌

ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టించిన సామజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా బీజేపీ అధినేత నితిన్‌గడ్కారీపై విరుచుకుపడ్డాడు. ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ కలసిట్టుగా మహారాష్ట్రలో రైతుల్ని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీయా.? లేక ప్రభుత్వంతో కుమ్మక్కయిందా.? చెప్పాలని కేజ్రీవాల్‌ ప్రశ్నిం చారు. మహారాష్ట్రలోని పలు భూములు, సాగునీటి కుంభకోణాల్లో బీజేపీ

అధ్యక్షుడు గడ్కారీపై నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలోని పలు భూములు, సాగునీటి కుంభకోణాల్లో బీజేపీ అధినేత జోక్యముందని ఆరోపించారు. తమ బృందంలో అంజలీ దమానియా నుండి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు రాబట్టామన్నారు. కాగా కేజ్రీవాల్‌ ఆరోపణలను గడ్కారీ తోసిపుచ్చారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో అక్రమాలు జరగలేదన్నారు. భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని గడ్కారి అన్నారు.