ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :

కిరణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లడకు.. ఈనెల 28న తెలంగాణపై అఖిలపక్షం జరిగి తీరాల్సిందే. తెలుగు మహాసభలున్నాయని అఖిలపక్షాన్ని వాయిదా వేయమంటావా అంటూ రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ముఖ్యమంత్రిపై ఫైరయ్యారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకుని అడ్డుకునేందుకు రాజకీయాలు ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రి పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఆయన ఇకముందు కూడా ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకుని తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు.