ఈ నెలలోనే చైతూ- సామ్‌ ల రిసెప్షన్‌ ..!

– రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి): ఇటీవల హుంగూఆర్భాటాలు లేకుండా ప్రేమ తరువాత చైతూ-సమంతలు అక్టోబర్‌ 6న గోవా వేదికగా ఒక్కటయ్యారు. ఇటు హిందూ అటు క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఎంతో గ్రాండ్‌ గా జరగనున్న రిసెప్షన్‌ కి టైం ఎప్పుడు ఫిక్స్‌ చేస్తారా అని అందరు ఎదురు చూస్తుండగా, నవంబర్‌ 12న హైటెక్‌ సిటీలోని ఎన్‌ కన్వెన్షన్‌ లో జరపాలని అక్కినేని ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అంగరంగ వైభవంగా జరగనున్న రిసెప్షన్‌ కి టాలీవుడ్‌, కోలీవుడ్‌ లకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలతో

పాటు రాజకీయ నాయకులని కూడా ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇన్విటేషన్స్‌ కూడా రెడీ అయిపోయాయని, మరో రెండు రోజులలో అతిధులని ఆహ్వానించే పనిలో అక్కినేని ఫ్యామిలీ బిజీ కానుందని టాక్‌. ఇదిలా ఉంటే నాగ చైతన్య తల్లి లక్ష్మీ .. దగ్గుబాటి సురేష్‌ బాబు ఇంట్లో చిన్న పాటి రిసెప్షన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిందట. చైతూ మేనమామ దగ్గుబాటి సురేష్‌ బాబు ఈ వేడుకని ఘనంగానే నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో వెంకటేష్‌ – రానా మరియు వారి దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారట. నెల్లూరు – కారంచేడు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి దగ్గుబాటి దగ్గరి బంధువులు కూడా వచ్చారని తెలుస్తోంది.