ఈ నెల 22 నుంచి గ్రామీణాభివృద్ధి జాతీయ సమ్మేళనం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న గ్రామీణ అభివృద్ధి లక్ష్యాలను వివరించేందుకు హైదరాబాదులో జాతీయ స్థాయి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరస్రాదరావు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో భారత్ నిర్మాణ్ వలంటీర్లతో పాటు దేశంలోని ప్రతిరాష్ట్రం నుంచి 10 మంది సర్పంచులు హాజరవుతారన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని మంత్రి చెప్పారు.



