ఈ నెల 26నుంచి కళాశాలల్లో టాన్క్‌ఫోర్క్ మూడోదశ తనిఖీలు
హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి డిసెంబరు 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాన్క్‌ఫోర్స్ కన్వీనర్ అజయ్ జైన్ తెలిపారు. టాన్క్‌ఫోర్స్ కమీటి సమావేశం ఈ రోజు హైదరాబాదులో జరిగింది. డిసెంబరు 10 నుంచి 15 వరకు 180 ఇంజినీరింగ్ కళాశాలల్లో నాలుగోదశ తనిఖీలు, డిసెంబరు 26 నుంచి 30 వరకు 139 ఇంజనీరింగ్ కళాశాలల్లో చివరి దశ తనిఖీలు చేపట్టనున్నట్లు అయన తెలిపారు. జనవరి ఒకటినుంచి ఎంబీఏ, ఎంసీయే, ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు చేపడతారు. ఇప్పటికే తనిఖీలు పూర్తయిన కళాశాలల్లో అవసరమైతే మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు కన్వీనర్ అజయ్‌జైన్ చెప్పారు.



