ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

ఇచ్చోడ సెప్టెంబర్ 03 (జనంసాక్షి ) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక జూమ్ టెక్నాలజి కంప్యూటర్ ఇన్స్ట్యూట్యూట్ లో తీసుకుంటున్నట్లు వారు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వృత్తి నైపుణ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థన్  ఇచ్చోడ మండల కేంద్రంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని జన శిక్షణ సంస్థ ఆదిలాబాద్ డైరెక్టర్ ఎం శ్యామల తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని కంప్యూటర్ టీచర్స్ ను ఎంపిక చేసి ఇన్స్టిట్యూట్ స్థలాలను ఆమె పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలోని యువతి యువకులు పదవ తరగతి స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సోమవారం నుండి జూమ్ టెక్నాలజీ కంప్యూటర్  ఇన్స్టిట్యూట్ దరఖాస్తులు తీసుకోబడతాయని సంస్థ ఏపీవో సంతోష్ 9666789710, కంప్యూటర్ టీచర్స్ 7013439477  లక్ష్మి లను సంప్రదించాలని సూచించారు.