ఉత్తరాదిని వణికిస్తున్న చలి

న్యూఢీల్లీ: చలిగాలుల ఉత్తరాదిని వణికిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందకు జంకుతున్నారు.దట్టమైన పొగ మంచు పలు రాష్ట్రల్లో రైలు రాకపోకలపై ప్రభావాన్ని చూపించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో మైనస్‌లోకి ఉష్ణోగ్రతలు చేరడంతో సరస్సుల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. చలిగాలుఎల తీవ్రతకు నిన్న ఒక్క ఒక్కరోజు 23 మంది మృతి చెందగా.. ఉత్తరప్రదేశ్‌లో మృతుల సంఖ్య 155కు చేరింది. మరోవైపు దేశ రాజాధాని ఢీల్లిలో ఉదయం 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢీల్లీ ఇంధిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో 30 వామన సర్సీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా… 10 సర్వీసులను రద్దు చేశారు. నిన్న ఢీల్లీలో గత ఐదేళ్ల కాలంలో 1.9 డిగ్రీల అత్యల్ప ఉషోగ్రత నమోదైంది.