ఉత్తర తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ తెలంగాణ, కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి బలహీనంగా  ఉందని తెలియజేశారు. వాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర జార్ఖండ్‌ వైపు తరిపోయిందని దీంతో శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయని వివరించారు.