ఉపాధిని కబలించే విదేశీ హైపర్, సూపర్ మార్టులు
హైదరామాద్: విదేశి హైపర్, సూపర్ మార్టులు భూతాల్లా ప్రవేశించి ఉపాధిని మింగేస్తున్నాయని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. చిల్లర వ్యాపారంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ బీజేపీ సికింద్రాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించింది. చిల్లర దుకాణాలను కబలించి రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో ఏకఛత్రాధిపత్య ధోరణితో విదేశీ దుకాణాలు వచ్చేస్తున్నాయని దత్తాత్రేయ ఆరోపించారు.



