ఉపాధి పనులపై సమస్యలుంటే ఫిర్యాదు చేయండి

శ్రీకాకుళం, జూలై 31: ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఎమైనా సమస్యలు ఉన్నా, జాబ్‌ కార్డులు అందకపోయినా గ్రేస్‌ ఇండియా సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని గాయత్రి రూరల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షురాలు ఎస్‌.కృష్ణకుమారి ఒక ప్రకటనలో కోరారు. కోటబొమ్మాళి మండలంలోని హరిశ్చంద్రపురం, నిమ్మాడ, బొడ్డపాడు, గోపాలపురం, పాకినవలస, రాజపురం, సుబ్బారావుపేట, తులసిపేట, వెంకటాపురం తదితర గ్రామాల్లో ఇటీవల రెండు రోజుల పాటు ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించామని తెలిపారు. ఈ పనులపై సమస్యలుంటే 1800110707, 155321 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.