ఉపాధ్యాయులు ఉగాది రోజున ‘స్పాట్’కు రావాల్సిందే
హైదరాబాద్: ఉగాది పర్వదినాన ఉపాధ్యాయుల సెలవుకు అధికారులు ‘స్పాట్’ పెట్టారు. ‘పండుగ… గిండుగ జాన్తానై, విధులకు హాజరుండి’ అని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. సుమారు 15 వేల మంది ఉపాధ్యాచయులకు పదో తరగతి స్పాట్ వాల్యువేషన్ విధులు కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. తెలుగు భాష… తెలుగు సంస్కృతి అంటూ గొప్పలు చెబుతూ తెలుగు సంవత్సరాది రోజున సెలవు లేదంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6 వరకు పూర్తి కానున్నాయి. కానీ ఏప్రిల్ 10 నుంచి స్పాట్‌ను వాల్యుయేషన్ మొదలు పెట్టనున్నారు. కాగా, పండుగ రోజున సెలవు ఇవ్వాలని… లేదంటే స్పాట్‌ను బహిష్కరిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.


