ఎండిన పంటలను చూపిస్తాం .. రాజీనామా చేస్తారా?: మంత్రి పొన్నాలకు తెరాస సవాల్‌

హైదరాబాద్‌ : మంత్రి పొన్నాల నియోజకవర్గంలోని జనగాం,రఘనాథపల్లి ,ఖిలాషాపూర్‌లో ఎండిన పంటలను తెరాస ఎమ్మెల్యేల బృందం పరీశీలించింది. ఎండిన పంటలను చూపిస్తే రాజీనామా చేస్తారా అని మంత్రి పొన్నాల కు తెరాస నేత ఈటెల రాజేందర్‌ సవాలు విసిరారు.తెలంగాణ వ్యాప్తంగా ఎండిన పంటలను చూపెందుకు తాము సిద్దమని ఆయన తెలిపారు.విద్యుత్‌ సమస్యలపై వచ్చే నెల 9న వామపక్షాలు చేపట్టే బంద్‌పై పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.