ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను వెంటనే ప్రకటించాలని ధర్నా

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను వెంటనే ప్రకటించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత మండలి వద్ద ధర్నా చేశారు. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలతో ప్రభుత్వం కుమ్మక్కై సరిగా వాదించనందునే సుప్రీంకోర్టులో ప్రైవేట్‌ కాలేజీలకు తీర్పు అనుగుణంగా వచ్చిందని ఆరోపించారు. కామన్‌ ఫీజుల పేరుతో ఫీజులను పెంచాలని చూస్తే సహించేది లేదన్నారు.