ఎక్సైజ్‌ ప్రొబేషనరీ ఎన్‌ఐలకు డిఫ్తీరియా

హైదరాబాద్‌ : బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఎన్‌ఐలు డిఫ్తీరియాతో బాధపడుతూ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డిఫ్తీరియా లక్షణాలతో 60 మందికిపైగా ఫీవర్‌ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఎన్‌ఐల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ చెప్పారు. అయితే ఫీవర్‌ ఆసుపత్రిలోకి పోలీసులు మీడియాను అనుమంతించడం లేదు.