ఎక్సైజ్ సీఐ నివాసంలో ఏసీబీ సోదాలు
గుంటూరు క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపనలపై తెనాలి ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న రవీంద్రబాబు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐకి చెందిన గుంటూరు నెహ్రునగర్‌లోని నివాసంలోపాటు అదే ప్రాంతంలో ఉంటున్న అతని బంధువుల ఇళ్లల్లో ఏసీబీ డీఎస్పీలు నర్సింహారావు, భాస్కర్‌రావు ఆధ్వర్యంలో 30 మంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. తెనాలి ఎక్సైజ్ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు.



