ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి లౌకికవాది కావాలి:నితీష్ కుమార్
హైదరాబాద్ : ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిపై జేడి(యూ) అధినేత నితీష్‌కుమార్ కొన్ని వాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి లౌకిక వాది అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ జరి గిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని అభ్యర్ధిగా గుజరాత్ సీఎం నరేంద్రమోడి అని పలు వర్గాలు ప్రచారం చేస్తున్న నేపద్యంలో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా సంకేతాలను నితీష్ వెల్లడించారు. అయితే ప్రధాని అభ్యర్ధి ఎంపికపై నితీష్ ఎలాంటి తుది గడువు విధించలేదు.



