ఎన్నికల కోసమే తెరాసపై అసత్య ఆరోపణలు: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తోంది. తెరాసనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శిలు గుప్పించారు. పాదయాత్రలో చంద్రబాబు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండి  పడ్డారు. వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే తెరాస పోరాడిందని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెరాసపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కదాదని బాబు చెప్పడం కాదు.. తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. తన పనితీరు గురించి తెదేపా ఎమ్మెల్యేలను చంద్రబాబు అడిగి తెలుసుకోవాలని హరీష్‌రావు సూచించారు.

తాజావార్తలు